కళాతపస్వి కె.విశ్వనాథ్, హీరో కమల్‌హాసన్ మధ్య గురు శిష్యుల బంధం ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఎప్పటికీ గుర్తుండిపోయే ‘సాగర సంగమం’,స్వాతి ముత్యం,‘శుభ సంకల్పం’ చిత్రాలొచ్చాయి. కమల్ హసన్ లో నటుడిని మరోస్థాయిలో నిలబెట్టింది విశ్వనాథ్ చిత్రాలే. ఈ విషయాన్ని కమల్ చాలా సార్లు చెప్పారు. అలాంటి గురు స్థానంలో వున్న కె.విశ్వనాథ్ వెళ్లిపోయే కనీసం చివరి చూపు కోసం రాలేదు కమల్ హాసన్. చాలా మందిలానే కేవలం సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించి ఊరుకున్నారు కమల్ హసన్. ఇళయరాజ లాంటి వ్యక్తులు వీడియో సందేశమైన పంపారు. కమల్ కనీసం అదీ చేయలేదు.
కమల్ చెన్నయ్ లో వుంటారు. ఎవైనా పనుల్లో బిజీగా వుండటం వలన ఆ రోజు రావడం కుదరకపోవచ్చు. కానీ తర్వాత రోజైన కుటుంబాన్ని పరామర్శించడానికి రావాల్సింది. కమల్ ఏ పరిస్థితిలో వున్నారో కానీ తనకు అపురూపమైన చిత్రాలు అందించిన ఓ దిగ్గజ దర్శకుడు, గురుతుల్యుడైన కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తి పట్ల కమల్ చూపించే అభిమానం గౌరవం ఇదేనా అని కమల్ అభిమానులు సైతం వాపోతున్నారు.