కమల్ హసన్ మంచి నటుడే కాక సామాజిక స్పృహ ఉన్న ఒక బాధ్యతగల పౌరుడు కూడా.
ఇక అమ్మ జయలలిత మరణం తరువాత తమిళనాడు లో జరుగుతున్న రాజకీయాల పైన తన మార్కు కామెంట్స్ చేస్తూ హెడ్లైన్స్ లో నిలుస్తున్నాడు. తాజాగా ఆయన రాజకీయ రంగప్రవేశం కూడా చేయబోతున్నట్టు వస్తున్న వార్తలతో తమిళనాట రాజకీయం వేడెక్కెంది.
ఈ తరుణంలో ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అవ్వడం వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్న గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్ చెన్నై రావడం ఆయనని కమల్ చిన్న కుమార్తె అయిన అక్షరా హసన్ విమానాశ్రయంలో స్వాగతం పలికి వారి ఇంటికి తీసుకెళ్ళడంతో ఏదో ప్రకటన రాబోతున్నది అన్న సంకేతాలు ఊపందుకున్నాయి.