బాలీవుడ్‌లో ఇప్పుడు అత్యంత వివాదాస్పద వ్యక్తి ఎవరంటే కంగనా రనౌత్ పేరు చెబుతారంతా. ఏదో ఓ విషయమై సంచలన స్టేట్‌మెంట్లు ఇస్తూ, నిత్యం వార్తల్లో ఉంటోంది. ఆమెపై లెక్కలేనన్ని కేసులు. ఫిర్యాదులు. ఇప్పుడు మరోటి నమోదయ్యింది. కంగనా వ్యాఖ్యలు, ప్రవర్తన మతాల మధ్యన చిచ్చుపెట్టేలా ఉందని ముంబై న్యాయ స్థానంలో ఓ పిటీషన్ దాఖలైంది. దానిపై విచారణ చేపట్టాలని, అవసరమైతే కంగనాని అదుపులోకి తీసుకుని విచారించాలని సదరు న్యాయ స్థానం పోలీసు శాఖని ఆదేశించింది.
సాక్ష్యాత్తూ కోర్టే.. కంగనా విషయంలో సీరియస్ అవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ.. గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ముంబై పోలీసులు ఇప్పటికే రెండు సార్లు కంగనాకు నోటీసులు జారీ చేశారు. మూడో సారి కూడా ఆమె విచారణకు హాజరు కాకపోతే.. అరెస్ట్ తప్పదని సమాచారం.