మణికర్ణిక- ది క్వీన్ అఫ్ ఝాన్సీ చిత్ర షూటింగ్ సమయంలో నటి కంగనా తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.
అందుతున్న వివరాల ప్రకారం, మణికర్ణిక పాత్రలో నటిస్తున్న కంగనా రనౌత్ ఒక సన్నివేశంలో భాగంగా కత్తి సాము చేస్తుండగా ఒక నటుడు కత్తి ఈమె నుదురికి ఒక్కసారిగా తగలడంతో పెద్ద గాయమయింది.
వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించగా ఆమెకి 15కుట్లు వేసినట్టు సమాచారం అలాగే త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని వైద్యులు చెప్పారు. ఆమెకి ఒక రెండు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారట.
అయితే ఈ చిత్రానికి సంబందించిన పోరాట సన్నివేశాల్లో ఎటువంటి డూప్ లేకుండా నటిస్తాను అని కంగనా చెప్పడంతోనే చిత్ర యూనిట్ వారు ఏమి వారించలేకపోయారు అని తెలుస్తుంది.
మొత్తానికి ఒక పెద్ద ప్రమాదం నుండి కంగనా బయటపడిందనే చెప్పాలి.