బాలీవుడ్ అంతా ఇప్పుడు `డ్రగ్స్` కేసు చుట్టూ తిరుగుతోంది. డ్రగ్స్ తప్ప మరో మాట లేదక్కడ. ఒకొక్కరుగా.. ఈ కేసులో ఇరుక్కుంటున్నారు. మరింత మంది పేర్లు బయటకు వస్తాయో చెప్పలేని పరిస్థితి. తాజాగా.. ఈ కేసు కంగనా మెడకూ చుట్టుకునే అవకాశాలున్నట్టు అనుమానిస్తున్నారు. ఇటీవల డ్రగ్స్ గురించి కంగనా మాట్లాడుతూ ``నేనూ డ్రగ్స్ బాధితురాలినే. ఒకానొకప్పుడు నేనూ డ్రగ్స్ తీసుకున్నా`` అని ప్రకటించింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే కంగనాని ముంచేలా కనిపిస్తున్నాయి.
ఈ పాయింట్ పట్టుకుని కంగనా వ్యతిరేక వర్గం ఆమెని ఇరుకున పడేసే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా నగ్మా వ్యాఖ్యలు కంగనాని ఇబ్బందిలో పడేశాయి. డ్రగ్స్ తీసుకున్నట్టు స్వయంగా వెల్లడించిన కంగనా రనౌత్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్‌సీబీ) ఎందుకు సమన్లు పంపించలేదని నగ్మా ప్రశ్నించింది. డ్రగ్స్ ఇంత సీరియస్ ఇష్యూ అవుతున్నప్పుడు అసలు దాని గురించి మాట్లాడడమే రిస్క్. అలాంటప్పుడు `నేను డ్రగ్స్ తీసుకున్నా...` అని కంగననే స్వయంగా అంటే అధికారులు ఆమెను ఎందుకు ప్రశ్నించడం లేదన్నది పాయింటే.
`గతంలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించిన కంగనా రనౌత్‌కు ఎన్‌సీబీ ఎందుకు సమన్లు పంపలేదు. వాట్సాప్ ఛాట్ ఆధారంగానే మిగిలిన హీరోయిన్లను పిలిచారు కదా! మరి, స్వయంగా వెల్లడించిన కంగనను ఎందుకు పిలవలేద? అయినా టాప్ హీరోయిన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు లీక్ చేసి వారి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడమే ఎన్‌సీబీ డ్యూటీయా` అని నగ్మా ప్రశ్నించారు. దాంతో కంగనా కూడా రిస్క్‌లో పడినట్టైంది.