యంగ్ డైరెక్టర్ కన్నుమూత

మరిన్ని వార్తలు

కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ఒక విషాద సంఘటన జరిగింది.

యువ దర్శకుడు కన్నన్ రంగస్వామి (28) అనారోగ్యంతో కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే, రంగస్వామి గత నెలలో గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఇక అదే క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గత 15 రోజుల క్రితం ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు.

ఇక గత 40రోజుల నుండి ఆయన అస్వస్థతతో ఉండి నిన్న ఉదయం ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దీనితో ఒక్కసారిగా ఆయన కుటుంబం, సన్నిహితులు శోకసముద్రంలో మునిగిపోయారు.

రంగస్వామి సినీ కెరీర్ ని పరిశీలిస్తే, ఈ సంవత్సరం మార్చ్ లో దాయం అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక రంగస్వామి మృతికి కన్నడ చలనచిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది.

ఈ సందర్భంగా www.iqlikmovies.com తరపున కన్నన్ రంగస్వామి మృతికి సంతాపం తెలియచేస్తున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS