కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ తో బాగా ప్రజాదరణ పొందిన స్టాండ్ అప్ కమెడియన్ కపిల్ శర్మ.
ఈయన నిన్న అకస్మాతుగా ఆనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రిలో చేరిపించాల్సి వచ్చింది. ఈ అనారోగ్యానికి కారణం, పని ఒత్తిడి అలాగే ఫిరంగి అని తను హీరోగా నటిస్తున్న సినిమా కోసం విశ్రాంతి లేకుండా షూటింగ్ చేయడం వల్లనే ఇలా అనారోగ్యానికి గురయినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతానికి కపిల్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కాకపోతే ఆసుపత్రి నుండి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అన్న విషయం పై ఎటువంటి సమాచారం లేదు.