కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్ ల ముద్దుల కొడుకు తైమూర్ అలీ ఖాన్ మొదటి పుట్టినరోజు కుటుంబసభ్యుల నడుమ నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలు హర్యానాలోని పటౌడిల సంస్థానంలో జరిగింది.
ఇక ఈ సందర్భంగా తైమూర్ కి అటు పటౌడి కుటుంబం నుండి ఇటు కపూర్ కుటుంబం నుండి బహుమతులు వెల్లువెత్తాయి. ఈ తరుణంలోనే తైమూర్ కి వారి సన్నిహితులైన ఒకరి దగ్గరి నుండి ఒక చిన్న అడవి బహుమతిగా వచ్చింది.
ఆ చిన్న అడివి విస్తీర్ణం 1000 గజాలు ఉండగా ఆ స్థలంలో చిన్న చిన్న మొక్కలు పెంచారట. ఆ మొక్కలు వయసు తైమూర్ అలీ ఖాన్ కన్నా తక్కువ ఉండడం ఆసక్తికరం. ఇక ఇప్పటికే సైఫ్ తన కొడుకుకి ఒక పెద్ద కారునిబహుమతిగా ఇచ్చిన సంగతి విదితమే.
ఎంతైనా పటౌడి యువరాజుకి బహుమతులు ఆ స్థాయిలో ఉండకపోతే ఎలా..