బిగ్ బాస్ 2 పైన సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి కార్తీక

By iQlikMovies - June 14, 2018 - 19:42 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ లో పార్టిసిపెంట్ గా ఉన్న కత్తి కార్తీక ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 2 పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఇంతకి కార్తిక ఏమందంటే- బిగ్ బాస్ సీజన్ లో తెలంగాణ ప్రాంతం నుండి ముగ్గురు పార్టిసిపెంట్స్ ఉండగా ఇప్పుడు మాత్రం ఒక్కడు కూడా లేకపోవడం చాలా శోచనీయం అని కామెంట్ చేసింది. తాను బిగ్ బాస్ కి ముందు కొద్దిమందికే తెలుసు అని అలాంటిది ఆ షో తరువాత చాలా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ వచ్చింది అని చెప్పుకొచ్చింది.

అలానే ఈ సీజన్ లో కూడా ఈ ప్రాంతం నుండి ఎవరైనా ఉంది ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పింది. మరి ఈ వ్యాఖ్యలకి స్పందించి బిగ్ బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరినైనా తెలంగాణకి చెందిన వారిని లోపలికి పంపిస్తారో ఏమో చూడాలి. 

ఇక బిగ్ బాస్ సీజన్ 2 ప్రేక్షకులకి ఇప్పటివరకైతే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నది.     

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS