చివ‌రి రెండు గంట‌ల్లోనే అంతా అయిపోయిందా?

మరిన్ని వార్తలు

క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణం... షాక్ కి గురి చేసింది. ఓ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన క‌త్తి మ‌హేష్‌.. చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. కారు ప్ర‌మాదంలో మ‌హేష్ కి గాయాలైనా.. ఆయ‌న కోలుకున్న‌ట్టే క‌నిపించింది. క‌త్తి మ‌హేష్ ఆరోగ్యం కుదుట ప‌డుతోంద‌ని, త్వ‌ర‌లోనే డిశ్చార్జ్ అవుతాడ‌ని స‌న్నిహితులు సోష‌ల్ మీడియా ద్వారా అప్ డేట్ ఇస్తూనే వ‌చ్చారు. కొన్ని రోజ‌లుగా ఎలాంటి అప్డేట్ బ‌య‌ట‌కు రాలేదు. దాంతో.. మ‌హేష్ ఆరోగ్యం కుదుట ప‌డింద‌నే అనుకున్నారు. అయితే స‌డ‌న్ గా మ‌ర‌ణ‌వార్త వినాల్సివ‌చ్చింది.

 

శ‌నివారం మ‌ధ్యాహ్నం స‌రిగ్గా 3 గంట‌ల‌కు క‌త్తిమ‌హేష్ తుదిశ్వాస విడిచాడు. అంత‌కు రెండు గంట‌ల ముందే.. మ‌హేష్ ఆరోగ్యం తిర‌గ‌బ‌డింద‌ని తెలుస్తోంది. కత్తి మ‌హేష్ ఊపిరితిత్తుల్లో నీరు చేరింద‌ని, ఆయ‌న శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మైంద‌ని, కృత్రిమంగా ఆక్సిజ‌న్ సిలెండ‌ర్ తో ఆక్సిజ‌న్ స‌ప్లై చేసినా ఫ‌లితం లేక‌పోయింద‌ని తెలుస్తోంది. క‌త్తి మ‌హేష్ భారీ కాయుడు. త‌న‌కు ఊబ‌కాయం స‌మ‌స్య ఉంది. దాంతో పాటుగా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లూ ఉన్నాయి. కారు ప్ర‌మాదంలో కంటికి బాగా డ్యామేజీ అయ్యింది. మెద‌డులో ర‌క్త‌స్రావం అయ్యింది. ఇదంతా క‌త్తిని క్లిష్ట ప‌రిస్థితుల్లో ప‌డేశాయి. నిజానికి సోమ‌వారం క‌త్తి మ‌హేష్ డిశ్చార్జ్ అవ్వాల్సివుంది. అయితే.. అనూహ్యంగా త‌న ప‌రిస్థితి విష‌మించి - ప్రాణాలు కోల్పోవాల్సివ‌చ్చింది. విధి రాత‌లు ఇలానే ఉంటాయి మ‌రి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS