కత్తి మ‌హేష్ ఆరోగ్య‌ ప‌రిస్థితి ఏమిటి?

మరిన్ని వార్తలు

ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడ‌, సినీ విశ్లేష‌కుడు క‌త్తి మ‌హేష్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న క‌రంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. తొలుత స్వ‌ల్ప గాయాలే... అని ఆయ‌న స‌న్నిహితులు చెప్పినా, ఆ గాయాలు తీవ్రంగా ఉన్నాయ‌ని, ఓ క‌న్ను పూర్తిగా పోయే ప్ర‌మాదంలో ప‌డ్డాడ‌ని తెలుస్తోంది. బ్రెయిన్ స‌ర్జ‌రీ అత్య‌వ‌స‌ర‌మ‌ని, ఆయ‌న్ని చెన్నైలోని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నార‌ని స‌న్నిహితులు తెలిపారు.

 

క‌త్తిమ‌హేష్ సీటు బెల్ట్ పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్లే గాయాల పాల‌య్యార‌ని, సీటు బెల్ట్ పెట్టుకుంటే ఆయ‌న ఇంత రిస్క్‌లో ప‌డేవారు కాద‌ని స‌మాచారం అందుతోంది. చికిత్స నిమిత్తం... చాలా డ‌బ్బులు అవ‌స‌రం అవుతాయ‌ని, అయితే క‌త్తి మ‌హేష్ కి అన్ని విధాలా సహాయం చేయ‌డానికి ఆయ‌న స్నేహితులు సిద్ధంగా ఉన్నార‌ని, ఆర్థిక ప‌ర‌మైన ఇబ్బంలేవీ ప్ర‌స్తుతానికి లేవ‌ని స‌న్నిహితులు తెలుపుతున్నారు. మ‌హేష్ ప‌రిస్థితి క్రిటిక‌ల్ అన్న‌ది స్ప‌ష్టం. ఆయ‌న త్వ‌రగా కోలుకోవాల‌ని, ఆరోగ్యంగా తిరిగి రావాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు.

 

సోష‌ల్ మీడియాలో సైతం... ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై చ‌ర్చ జ‌రుగుతోంది. స్నేహితులు, స‌న్నిహితులు, సినిమావాళ్లు అంతా.... క‌త్తి మ‌హేష్ ఆరోగ్యంపై ఆందోళ‌న చెందుతున్నారు. క‌త్తిమ‌హేష్ త్వ‌ర‌లోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాల‌ని ఐక్లిక్ కూడా కోరుకుంటోంది. గెట్ వెల్ సూన్‌...మ‌హేష్ గారూ..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS