క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణం.. కొత్త ప్ర‌శ్న‌లు.. జ‌వాబులే లేవు!

మరిన్ని వార్తలు

క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణం... ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయ‌న రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి, ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మర‌ణం వెనుక కుట్ర ఉంద‌న్న అనుమానాల్ని ఆయ‌న స‌న్నిహితులు వ్య‌క్త ప‌రుస్తున్నారు. క‌త్తిమ‌హేష్ ఆరోగ్యం కుదుట ప‌డుతోంద‌ని, ఆయ‌న్ని డిశ్చార్జ్ చేస్తార‌ని వైద్యులు చెప్పార‌ని, ఇంత‌లోనే ప‌రిస్థితి తారుమారు అవ్వ‌డం ప‌ట్ల త‌మ‌కు అనుమానాలున్నాయ‌ని క‌త్తి మ‌హేష్ స‌న్నిహితులు కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న, అనుమానాలు వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు క‌త్తిమ‌హేష్ తండ్రి ఓబులేసు కూడా కొత్త ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నారు. క‌త్తిమ‌హేష్ మ‌ర‌ణ వార్త త‌మ‌కు ఆల‌స్యంగా తెలిసింద‌ని, ముందే ఈ వార్త మీడియాకు లీకైంద‌ని, ఆ త‌ర‌వాతే త‌మ‌కు తెలిసింద‌ని ఆయ‌న తెలిపారు. అంటే.. క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణం వెనుక ఏదో కోణం ఉండొచ్చ‌ని ఆయ‌న అనుమానిస్తున్నారు. అంతే కాదు.. అంత పెద్ద ప్ర‌మాదం జ‌రిగినా,కారు డ్రైవ‌ర్ కి ఏమీ కాలేద‌ని, తాను క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాడ‌ని, మ‌హేష్ కి మాత్ర‌మే తీవ్ర గాయాలు ఎలా అయ్యాయ‌ని ఆయ‌న ప్రశ్నిస్తున్నారు. క‌త్తి మ‌హేష్ వైకాపా కి సపోర్ట్ చేశాడ‌ని, ఆ పార్టీ వ్య‌తిరేకుల దృష్టి క‌త్తి మ‌హేష్ పై ప‌డింద‌ని, క‌త్తిమ‌హేష్ పై చాలాసార్లు భౌతిక దాడి జ‌రిగింద‌ని, ఈ ప్ర‌మాదంలోనూ వాళ్ల హ‌స్తం ఉందేమోన‌ని కత్తి మ‌హేష్ స‌న్నిహితులు చెబుతున్నారు. అయితే ఇవ‌న్నీ కేవ‌లం ప్ర‌శ్న‌లు మాత్ర‌మే. స‌మాధానాలు రాబ‌ట్టాల్సింది పోలీసులు, చ‌ట్ట‌మే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS