ప్రేమికులు విడిపోతే ద్వేషించుకోవాలా?

మరిన్ని వార్తలు

ఓ అమ్మాయి అర్ధరాత్రి, జోరు వర్షంని లెక్క చేయకుండా ఇంటిగోడ దూకి తాను ప్రేమించిన అబ్బాయి ఇంటి తలుపుకొడుతుంది. ప్రేమలో ఇంత పిచ్చి వుంటుంది. ఇదే ప్రేమ వికటిస్తే.. అదే అమ్మాయి అదే అబ్బాయిపై ద్వేషం పెంచుకొని పతనమైపోతుంది. ఇది మహానటిలో చూపించిన సావిత్రి ప్రేమకధ. ప్రపంచంలో వికటించే ప్రేమకధలన్నీ ఇలానేవుంటాయి. ప్రేమపక్కనే ద్వేషం వుంటుంది.

 

ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడి ప్రేమ స్వర్గంని చూసిన ఇద్దరు.. అదే ప్రేమ బెడిసికొడితే ఒకరి పతనంను ఒకరు కోరుకుంటారు. హ్యూమన్ సైకాలజీ ఇది. అయితే దీనికి తాను వ్యతిరేకం అంటుంది బార్బీ డాల్ కత్రినా కైఫ్. ''ప్రేమికులు విడిపోతే ద్వేషించుకోవాలనే రూల్ ని నేను నమ్మను. నాకు నా మాజీ లవర్స్‌ ఎదురైతే నాలో ఎలాంటి ఫీలింగ్ వుండదు. పైగా వారితో గడిపిన క్షణాలను కూడా గుర్తు చేసుకోను. అసలు ఆ అవసరం లేదు.

 

అందరికీ ప్రేమ వర్క్ అవుట్ కాదు. అంతమాత్రానికే మాజీ లవర్స్‌ ఎదురవగానే అలిగి వెళ్లిపోవడం, బాధపడటం, కోపం పెంచుకోవడం నాకు ఇష్టం వుండదు. ఎందుకంటే.. కోపం, ద్వేషం, బాధ ఇవన్నీ ఎమోషన్స్. వాళ్ళు మన జీవితంలో లేనప్పుడు.. వాళ్ళు గురించి ఇలాంటి ఎమోషన్స్ మనసులోకి తీసుకురావడం కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్'' అని చెప్పింది కత్రినా. ప్రాక్టికల్ గా కత్రినా మాటలు ఎంత వరకూ పాజిబుల్ అవుతాయో తెలియదు కానీ.. మాజీ ప్రేమికుల విషయంలో కత్రినా యాటిట్యూడ్ మాత్రం బావుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS