బెల్లంకొండ శ్రీనివాస్‌కి అదృష్టం కలసి రావడం లేదు. 'సినిమా బాగానే ఉంది' అనే టాక్ వచ్చినా.. నిర్మాతలు సేఫ్ జోన్లో పడడం లేదు. దానికి గల కారణం... బెల్లంకొండ బడ్జెట్లు ఆ స్థాయిలో ఉండడం. తన మార్కెట్‌కి మించి ఖర్చు పెట్టడం, ఆనక చేతులు కాల్చుకోవడం బెల్లంకొండ సినిమాలకు అలవాటుగా మారింది. అయితే 'కవచం' విషయంలో అలాంటి పొరపాటు జరక్కుండా చూసుకున్నారట. బెల్లంకొండ నటించిన తాజా చిత్రమిది. కాజల్, మెహరీన్ కథానాయికలుగా నటించారు. శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమాకి రూ.30 కోట్ల బడ్జెట్ అయ్యిందట.
అయితే... శాటిలైట్, డిజిటల్ రూపంలో ఇప్పటికే రూ.20 కోట్లు తిరిగొచ్చేశాయని సమాచారం. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలోనూ మంచి మొత్తమే వచ్చిందని తెలుస్తోంది. మరో రూ.10 కోట్లు థియేటరికల్ నుంచి వస్తే చాలు, నిర్మాతలు సేఫ్ అయిపోతారు. ''బడ్జెట్లు పెరిగిపోతున్నాయన్న విషయం నేనూ గమనించా. అందుకే ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. 'కవచం' విడుదలకు ముందే సేఫ్ అయిపోయింది. ఇక ముందు ఇలానే ఆలోచించి సినిమాలు చేస్తా'' అంటున్నాడు బెల్లంకొండ