మహానటి చిత్రంలో సినీ పరిశ్రమలో మహానటిగా కీర్తింపబడుతున్న సావిత్రి గారి నిజజీవిత పాత్రని పోషిస్తున్న నటి కీర్తి సురేష్ ఈమధ్యనే ఒక ఆసక్తికరమైన పనిచేసిందట.
అదేంటంటే- సావిత్రిగారు ఎలా ఉండేవారు ఎలా తోటివారితో మెలిగేవారు అనే అంశాలని అన్ని సవివరంగా తెలుసుకున్న కీర్తి సురేష్, ఆమె నిజజీవితంలో షూటింగ్ చేస్తున్న సందర్భంలో స్పాట్ లో ఉన్న ప్రతిఒక్కరికి బంగారు నాణాలను పంచిపెట్టినట్టుగా కీర్తి సురేష్ కూడా మహానటి సెట్ లో ఉన్న వారికి బంగారం పంచిందట.
అప్పుడు మహానటి చేసిన పనినే ఇప్పుడు ఈమె కూడా చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఆమె పాత్రని తెరపైనే గాక తెరవెనుక కూడా పోషిస్తున్న కీర్తి సురేష్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక ఇలా ఆమె చేసిన మంచి పనులనే గాక ఆమె పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం కూడా తన నటనా ప్రతిభతో న్యాయం చేస్తుందట కీర్తి.
ఏదేమైనా ఇలా అందరికీ బంగారం పంచి అందరి చేత బంగారం అని అనిపించేసుకుంది ఈ నవతరం సావిత్రి.