లాక్ డౌన్ తో ఇబ్బందుల్లో పడ్డారు నిర్మాతలు. పూర్తయిన సినిమాల్ని థియేటర్లలో విడుదల చేయడానికి ఇంకొన్నాళ్లు ఆగాలో, లేదంటే ఓటీటీ బాట పట్టి సొమ్ములు చేసుకోవాలో అర్థం కావడం లేదు. కొన్ని సినిమాలు.. ఓటీటీకి వెళ్లిపోయాయి. అయితే... హిట్టు శాతం చాలా తక్కువ. మరి కొన్ని సినిమాలు సైతం.. ఏదో రేటుకి ఓటీటీకి అమ్ముకోవాలని చూస్తున్నాయి. అందులో భాగంగా... కీర్తి సురేష్ `గుడ్ లక్ సఖీ` కూడా.. ఓటీటీలో విడుదల అవ్వబోతోందని ప్రచారం జరిగింది. కీర్తి గత చిత్రాలు పెంగ్విన్, మిస్ ఇండియా లు సైతం ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు అదే బాటలో ఈ సినిమా కూడా వెళ్లిందని వార్తలొచ్చాయి. వీటిపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది
తమ సినిమాని ఓటీటీలో విడుదల చేయడం లేదని, కేవలం థియేటర్లలోనే తీసు్ఒస్తామని... నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేనందున, త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని సెలవిచ్చాయి. ఆది పినిశెట్టి , జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. గేష్ కుకునూర్ ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్ గా ఎలా మారిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు మలయాళంలోనూ ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేయనున్నారు.