'మహానటి' సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. నవ్విన నాపచేనే పండిందన్నట్లుగా, ఆ పాత్రలో కీర్తిసురేష్ ఏంటీ.? అన్న వాళ్లే సినిమా రిలీజైన తర్వాత కీర్తిని తప్ప, మరొకర్ని ఆ పాత్రకు ఊహించలేనంతగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఈ తరం 'మహానటి' కీర్తిసురేష్.. అని కీర్తించారు. అయితే, కొంచెం బొద్దుగా ముద్దుగా ఉండే కీర్తిసురేష్ ఇప్పుడు ఫిట్‌నెస్‌పై బాగా దృష్టి పెట్టింది. ఏం చేసిందో ఏమో తెలీదు కానీ, బాగా వర్కవుట్స్ చేసి, జీరో సైజ్ అందాల్ని సొంతం చేసుకుంది. 'మైదాన్' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయం కావల్సిన కీర్తి సురేష్ ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది. అందుకు కారణం తన ఫిజిక్కే అంటున్నారు.
అజయ్‌దేవగణ్ సరసన చిన్న పిల్లలా కనిపిస్తున్న కారణంగా కీర్తి ఆ సినిమాని మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. నిజానికి తాజా లుక్స్‌లో అచ్చు నార్త్ ఇండియన్ బ్యూటీలా కనిపిస్తోంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సైజ్ జీరోలో చేయించుకున్న స్పెషల్ ఫోటో షూట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. హెయిర్ స్టైల్ దగ్గర నుండి, బాడీ లాంగ్వేజ్ వరకూ పూర్తిగా మార్చేసింది కీర్తి సురేష్. ఈ ఫోటోలు అంతర్జాలంలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ, ఇంతలా బక్క చిక్కిపోయిందేంటీ.? అంటూ కీర్తిని కొందరు ట్రాల్ చేస్తున్నారు. ఇంత బక్క పలచని అందాలు తెలుగు, తమిళ తంబీల్ని ఇంప్రెస్ చేస్తాయా.? అని వాపోతున్నారు కూడా. కాకపోతే, ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు, తమిళ తదితర భాషల్లో ఒకప్పుకున్న సినిమాలే దాదాపు ఐదారు వరకూ ఉండడం విశేషం. అన్నీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే. వాటిలో 'మిస్ ఇండియా', 'పెంగ్విన్' చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మరో మూడు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి.