బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చిన సినిమా 'ఖైదీ నెంబర్ 150'. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన మెగాస్టార్ సినిమా ఇది. మెగా సునామీనే సృష్టించింది. వస్తూ వస్తూనే ఓ ప్రభంజనం సృష్టించాడు. తొలి వారాంతంలోనే 72 మిలియన్స్ షేర్ దాటేసింది ఖైదీ సినిమా. ఇక ఓవర్సీస్‌లో అయితే రెండు మిలియన్లు దాటింది. ఇంతవరకూ సంక్రాంతి సందర్భంగా ఈ వసూళ్ల వరద కొనసాగింది. అయితే నేటి నుంచి అసలు పరీక్ష స్టార్ట్ కానుంది. ఎందుకంటే ఈ రోజుతో సెలవులు పూర్తయ్యాయి ఉద్యోగులకు సెలవులు పూర్తయ్యాయి. అయినా కానీ స్కూళ్లు, కాలేజీలు సెలవులు ఇంకా రెండు రోజులు ఉండడంతో వసూళ్ల రిజల్ట్‌ని ఇంకా అంచనా వేయలేని పరిస్థితి. ఈ సెలవులు ఈ రోజు, రేపు సినిమాకి బాగా కలిసి రావొచ్చు. మరో పక్క ఈ సినిమాలో మాస్ మెచ్చే అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో బీసీ సెంటర్స్‌లో ఈ సినిమా పూర్తిగా నిలదొక్కుకునే అవకాశాలు లేకపోలేవు. మొత్తానికి మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ అంటే ఎలా ఉండాలో అలాగే ఉంది. వినాయక్ పక్కాగా ఆడియన్స్ పల్స్‌ని బాగా పట్టుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు. చిరంజీవి తనకున్న ఎక్స్‌పీరియన్స్‌తో ఈ సినిమాని ఇంత సక్సెస్ చేశాడు. నిర్మాణ విలువల్లో చరణ్ తనదైన శైలిని ప్రదర్శించాడు. ఇక ముద్దుగుమ్మ కాజల్ ఈ సినిమాతో మెగా హీరోయిన్‌గా ఫిక్స్ అయిపోయింది. సినిమా విడుదలై వారం కావొస్తున్నా చిరు మేనియా ఇంకా తగ్గడం లేదనే చెప్పాలి.