ఓ వైపు క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూనే, ఇంకో వైపు వెబ్ సిరీస్‌లలో నటించేస్తోంది అందాల భామ కైరా అద్వానీ. సమయం లేకనే తెలుగు సినిమాల్ని కాదనుకుంటున్న ఈ బ్యూటీ, వెబ్ సిరీస్‌లకు మాత్రం ఏలా సమయం కేటాయించగలుగుతోంది.? ఈ ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, ‘సినిమా చేయడం వేరు.. వెబ్ సిరీస్ చేయడం వేరు.. వెబ్ సిరీస్‌కి సమయం దొరుకుతుంది.. సినిమా చేయడమంటే అంత తేలికైన విషయం కాదు. పైగా, బాలీవుడ్‌లో చాలా బిజీగా వున్న నాకు.. ఇక్కడే వెబ్ సిరీస్ చేయడం సులభతరమవుతుంది.. అదే ఇంకో భాషలో మళ్ళీ సినిమాలు చేయాలంటే కష్టమవుతుంది.
దర్శక నిర్మాతల్ని ఇబ్బంది పెట్టలేకనే వచ్చిన మంచి మంచి ఛాన్సుల్ని వదులుకోవాల్సి వస్తోంది’ అని చెప్పింది. ఇక, వెబ్ సిరీస్‌లలో హాట్ హాట్‌గా కన్పించడం గురించి ప్రశ్నిస్తే, ‘లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో అసలు అందాల ప్రదర్శన అనేదే వుండదు. అదొక కాన్సెప్ట్ బేస్ట్ వెబ్ సిరీస్. దాన్ని వల్గర్ కోణంలో కాకుండా, మామూలుగా ఆలోచిస్తే ఆ సన్నివేశం తాలూకు గొప్పతనం అర్థమవుతుంది’ అని కైరా అద్వానీ సమాధానమిచ్చింది. గ్లామర్ ప్రపంచం చాలా మారిపోయిందంటోన్న కైరా అద్వానీ, డిజిటల్ ప్లాట్‌ఫావ్స్‌ులో వల్గర్ కంటెంట్ చాలా ఎక్కువైపోయినా.. అందులోనూ కొన్ని క్రియేటివ్‌గా వున్నాయని అభిప్రాయపడింది. ‘నా వరకూ నేను ఫలానా విధంగా చేయకూడదు, ఫలానా విధంగా మాత్రమే చెయ్యాలి..’ అని అనుకోనంటోన్న కైరా అద్వారీ, త్వరలోనే ఓ సౌత్ సినిమాలో కన్పిస్తానని మాత్రం చెబుతోంది.