టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న కియారా అద్వానీ ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న కథానాయికల్లో ఒకరు. ఇటీవల రామ్ చరణ్‌తో కలిసి నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతికి విడుదలై మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ, కియారా తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇకపోతే, ‘వార్ 2’ ‘టాక్సిక్’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు, రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న ‘డాన్ 3’ లోనూ నటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి షాకింగ్‌గా తప్పుకుంది! సిద్దార్థ్ మల్హోత్రాతో 2023లో పెళ్లి చేసుకున్న కియారా – త్వరలో తల్లి కాబోతోంది! ఈ బిజీ షెడ్యూల్‌లో కూడా కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ, సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యిందని బలమైన టాక్.
‘డాన్ 3’ షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానుండగా, అప్పటికి కియారా నిండు గర్భిణిగా ఉండే అవకాశం ఉన్నందున, టీమ్‌తో కలిసి చర్చించి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో ‘డాన్’ సిరీస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1978లో అమితాబ్ బచ్చన్, 2006లో షారుఖ్ ఖాన్ నటించిన ఈ ఫ్రాంచైజీ, భారీ హిట్ కొట్టింది. కానీ ‘డాన్ 2’ అంతగా ఆడకపోవడంతో, ఇప్పుడు ‘డాన్ 3’ ను భారీ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, కియారా ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ తో డాన్ 3 టీమ్ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతోంది. బీటౌన్‌లో ఆలియా భట్, దీపికా పదుకొణె, కృతి సనన్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి కియారా ప్లేస్ లో ఎవరు సెటిల్ అవుతారో చూడాలి!