తెలుగు సినీ ప్రేక్షకుల్ని మళ్ళీ స్ట్రెయిట్ తెలుగు సినిమాతో పలకరించాలని వున్నా, ఆ పని చేయలేకపోతున్నందుకు బాధగా వుందని వాపోతోంది అందాల భామ కైరా అద్వానీ. తెలుగులో ఆమెకు తొలి సినిమా ‘భరత్ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ అయ్యింది. ఆ వెంటనే, ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించిన కైరా అద్వానీ, ఆ తర్వాత ఎన్ని ఛాన్సులు వచ్చినా తెలుగులో తిరిగి నటించలేదు.
ఈ మధ్యనే ఓ అగ్రహీరో సరసన నటించే ఛాన్స్ వస్తే, తొలుత ‘సరే’ అన్న కైరా అద్వానీ, ఆ తర్వాత ‘నో’ చెప్పేసిందట. ‘వినయ విదేయ రామ’ సినిమా టైవ్ులోనే ఎడా పెడా బాలీవుడ్ సినిమాలకు కమిట్ అయిన కైరా, ఆ సినిమాల్ని పూర్తి చేయడానికి నానా తంటాలూ పడాల్సి వస్తోంది. చేతిలో ఒకేసారి దాదాపు డజను సినిమాలు వచ్చి పడేసరికి, ఒక్కసారిగా కంగారుపడ్డ కైరా అద్వానీ, ఈ క్రమంలో టాలీవుడ్ సినిమాల్ని వదిలేసుకుంది. కానీ, టాలీవుడ్ మాత్రం ఆమెను అప్రోచ్ అవుతూనే వుంది.
తెలుగులో మూడు నాలుగు సినిమాల విషయమై ఆమెతో ఇప్పటికీ సంప్రదింపులు జరుగుతున్నాయట. కానీ, కైరా మాత్రం హిందీలో సినిమాలు చేస్తుండడం వల్ల, డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల తెలుగు సినిమాలు చేయలేకపోతున్నాననీ, అయితే ఖచ్చితంగా వీలైనంత త్వరగా తెలుగులో సినిమాలు చేస్తాననీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా కైరా అద్వానీ ఈ మధ్య ఓ భారీ సినిమాకి ‘నో’ చెప్పడం గమనార్హం.