మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అనే నేను పైన అంచనాలు ఆకాశాన్ని అంటుతున్న వేళ ఈ సినిమాకి సంబందించిన ఒక్కొక్క విషయం బయటకి వస్తున్నది.
అందులో లేటెస్ట్ గా బయటకివచ్చిన వార్త- హీరోయిన్ కియారా అద్వాని చేస్తున్న పాత్ర గురించి. ఈ చిత్రంలో ఆమె ఒక పవర్ ఫుల్ IAS పాత్రలో కనిపించబోతున్నట్టు యూనిట్ వర్గాల ద్వారా బయటకి పొక్కిన వార్త. ఇప్పటికే మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తుండడంతో సినిమా పైన మంచి హిట్ టాక్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా హీరోయిన్ IAS అంటే ఒక మంచి కమర్షియల్ చిత్రంగా తెరకెక్కింది అని అర్ధమవుతున్నది.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలని త్వరలోనే ప్రేక్షకులకి విడుదల చేయనున్నారట దర్శక-నిర్మాతలు.
ఇవి కియారా అద్వాని తొలి తెలుగు చిత్రం విశేషాలు.