చరణ్ హీరోయిన్ కే ఓటు వేసిన యశ్

మరిన్ని వార్తలు

యశ్ కన్నడ హీరో అయినా  కేజీఎఫ్ లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. నెక్స్ట్ యశ్ నుంచి ఏ ప్రాజక్ట్ వస్తుందా అని అంతా ఆశగా ఎదురు  చూస్తున్నారు. ఈ క్రమంలోనే యశ్ నుంచి టాక్సిక్ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. యశ్ కి ఇది 19వ సినిమా. KGF లాంటి క్రేజీ ప్రాజెక్ట్ చేసి ఫాలోయింగ్ పెంచుకున్న యశ్ నెక్స్ట్ స్టార్ దర్శకుడితో వర్క్ చేస్తాడు అనుకుంటే మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో వర్క్ చేయనున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్యర్యానికి గురి చేసాడు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తూనే టైటిల్, రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేసారు. టాక్సిక్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో 2025 ఏప్రిల్ 10న  యశ్ రానున్నాడు.


KGF తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావటంతో సినీప్రియులు, అభిమానులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే మేకర్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో నటించే హీరోయిన్ గూర్చి గత కొంత కాలంగా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి.  యశ్ పక్కన  కరీనా కపూర్ హీరోయిన్ అని వినిపించింది. దీనితో యశ్ ఫాన్స్ కొంచెం డీలా పడ్డారు. కరీనా క్రేజ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కాదు. పైగా యశ్ కంటే కరీనా పెద్దది. ఇంత మంది ఉండగా కరీనాని ఎందుకు తీసుకున్నారు అనే విమర్శలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే యశ్ ఫాన్స్ ఆనందపడే విషయం ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. 


ఈ మూవీలో కరీనా నటించటం నిజమే కానీ హీరోయిన్ గా కాదు. యశ్ కి సిస్టర్ గా అని సమాచారం. ఆలా అయితే యశ్, కరీనా అక్కా, తమ్ముడిలా అలరించనున్నారన్న మాట. ఇప్పుడు హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశారు. ఆమె మరెవరో కాదు 'కియారా అద్వానీ'. టాక్సిక్ పాన్ ఇండియా మూవీ కావటంతో అన్ని భాషల్లో గుర్తింపు ఉన్న కియారా అద్వానీ అయితే బెటరని మేకర్స్ ఈమెని ఫిక్స్ చేసినట్టు సమాచారం. తెలుగులో రామ్ చరణ్, మహేష్ బాబుల సరసన నటించింది కియారా. నెక్స్ట్ గేమ్ చేంజర్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారబోతోంది. దీనితో ఇప్పుడు యశ్ టాక్సిక్ లోనూ ఛాన్స్ కొట్టేసింది కియారా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS