స‌గం సినిమా అయ్యింది.. ద‌ర్శ‌కుడు జంప్‌!

By iQlikMovies - June 23, 2022 - 14:11 PM IST

మరిన్ని వార్తలు

కిర‌ణ్ అబ్బ‌వ‌ర‌పు హీరోగా న‌టిస్తున్న సినిమాల్లో `నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని` ఒక‌టి. కోడి రామ‌కృష్ణ కూతురు కోడి దివ్య ఈ సినిమాతో నిర్మాత‌గా పరిచ‌యం అవుతున్నారు. కార్తీక్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. స‌గం సినిమా పూర్త‌య్యింది. ఈ సినిమాకి సంబంధించిన ఓ పాట కూడా వ‌దిలారు. అయితే.. ఏమైందో ఏమో, ఇప్పుడు ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు మారిపోయాడు. శ్రీ‌ధ‌ర్ అనే మ‌రో ద‌ర్శ‌కుడు ఈ ప్రాజెక్టుని టేక‌ప్ చేశాడు.

 

ఇలా స‌డ‌న్ గా ద‌ర్శ‌కుడ్ని మార్చ‌డం... సినిమా టీమ్ ని ఇబ్బంది పెట్టేదే. కానీ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఈ మార్పు సంభ‌వించింద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. హీరోకీ, ద‌ర్శ‌కుడికీ క్రియేటీవ్ డిఫ‌రెన్సెన్ వ‌చ్చాయ‌ని, ర‌షెష్ చూసిన చిత్ర‌బృందం.. ద‌ర్శ‌కుడి ప‌నితీరుపై అసంతృప్తిగా ఉంద‌ని, అందుకే... ద‌ర్శ‌కుడ్ని మార్చేశార‌ని తెలుస్తోంది. సినిమా అంతా అయ్యాక‌.. ఒక‌రిని మ‌రొక‌రు నిందించుకోవ‌డం కంటే, ముందే.. సెటిల్ చేసుకోవ‌డం ఉత్త‌మ‌మ‌ని భావించార‌ని స‌మాచారం. ఈ చిత్రానికి క‌థ‌.. కార్తీక్ శంక‌ర్‌నే అందించాడు. అందుకే.. క‌థ‌కుడిగా త‌న పేరు అలానే ఉంచి ద‌ర్శ‌కుడ్ని మార్చార్ట‌. క‌థ‌కు.. సంబంధించిన పారితోషికం, స‌గం సినిమా తీసినందుకు రెమ్యున‌రేష‌న్‌.. ఇవి రెండూ సెటిల్ చేసేశార్ట‌. అంత్య నిష్టూరం కంటే, ఆది నిష్టూర‌మే మేలు క‌దా. అందుకే.. సినిమా అంతా అవ్వ‌క‌ముందే మేల్కొని ఈ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకొంది చిత్ర‌బృందం. మ‌రి.. రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS