అన్నయ్యని ఇలా పరిచయం చేస్తా అనుకోలేదు : కిరణ్ అబ్బవరం

మరిన్ని వార్తలు

హీరో కిరణ్ అబ్బవరం ఇంట విషాదం అలముకుంది. డిసెంబర్ 1 తేదిన జరిగిన రోడ్డు ప్రమాదంలో కిరణ్ అన్నయ్య అబ్బవరం రామాంజులు రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. తన సోదరుడి మృతిపై కిరణ్ తొలిసారి స్పందించారు. ఒక భావోద్వేగ పోస్ట్ ని ఇన్స్టా లో పోస్ట్ చేశారు.

 

''రేయ్ కిరణ్... మన ఊరికి సరిగ్గా రోడ్ కూడా లేదు. మన ఇద్దరిలో ఎవరో ఒకరమైన ఏదో ఒకటి చేసి గట్టిగా సాధించాలిరా తనకి వీలైన దానికంటే ఎక్కువ సపోర్ట్ చేశాడు. తన లగ్జరీని త్యాగం చేశాడు నన్ను హీరోగా చూడ్డం కోసం. ఇప్పుడిప్పుడే ఏదో సాదిస్తున్న అనే సమయానికి తను లేడు. నన్ను అందరికీ ఎప్పుడు పరిచయం చేస్తావ్ అని అడిగేవాడు. ఏదైనా గట్టిగా సాదించిన తర్వాత పరిచయం చేద్దామానుకున్న కానీ ఇలా పరిచియం చేయాల్సివస్తుందని అనుకోలేదు''అని ఉద్వేగానికి లోనయ్యారు కిరణ్. ''నా వెనుక వున్నది మా అన్న అబ్బవరం రామాంజులు'' అంటూ ఒక ఆడియో వేడుకలో తీసిన ఫోటోని షేర్ చేశాడు కిరణ్.

 

'రాజా వారు రాణి వారు' సినిమాతో పేరు తెచ్చుకున్నాడు కిరణ్. తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా మంచి టాక్ వచ్చింది. ఇటివలే కిరణ్ కొత్త సినిమా ప్రారంభమైయింది. ఇలాంటి ఆనందకరమైన సమయంలో కిరణ్ ఇంట్లో విషాదం చోటుచేసుకోవడం విచారకరం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS