ఇండ్రస్ట్రీ చాలా చిత్రవిచిత్రమైనది. అసలు ఊరు పేరు తెలియనివాళ్లు, బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లూ ఒక్క సినిమాతో స్టార్లయిపోతారు. కిరణ్ అబ్బవరం కూడా అంతే. `రాజావారు రాణీగారు` సినిమాతో ఇండ్రస్ట్రీలోకి వచ్చాడు కిరణ్. ఆ సినిమా సో..సోగా ఆడింది. అయితే కిరణ్ పెర్‌ఫార్మ్సెన్స్ అందరికీ నచ్చింది. దాంతో అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు `ఎస్.ఆర్.కల్యాణమండపం`తోనూ ఆకట్టుకున్నాడు. సెకండ్ వేవ్ తరవాత ఇండ్రస్ట్రీకి దక్కిన తొలి విజయం ఇది. వసూళ్లు బాగున్నాయి. దాంతో.. కిరణ్ కి డిమాండ్ పెరిగింది. ఈ హిట్టుతో.. తన పారితోషికం ఏకంగా 2 కోట్లకు పెంచేశాడని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.
`ఎస్.ఆర్.కల్యాణమండపం` ముందే కొన్ని సినిమాల్ని ఒప్పుకున్నాడు కిరణ్. అవన్నీ రీజనబుల్ పారితోషికాలతోనే చేశాడు. ఇప్పుడు మాత్రం 2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. `ఎస్.ఆర్. కల్యాణమండపం`కి దాదాపు 3 కోట్ల వరకూ ఖర్చయ్యింది. ఆ సొమ్ము వసూళ్ల రూపంలో రాబట్టుకోగలిగింది. ఇప్పుడు హీరోకే 2 కోట్లు ఇస్తే.. సినిమా మేకింగ్ కి ఎంత అవుతుంది? చివరికి ఎంత మిగులుతుంది? అనే లెక్కల్లో ఉన్నారు నిర్మాతలు. కొంతమందైతే.. కిరణ్ ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పుడూ దొరకడు అనే రేంజ్‌లో అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారు. మొత్తానికి ఒక్క సినిమాతో కిరణ్ సుడి తిరిగినట్టే.