'కిరాక్ పార్టీ' ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్

By iQlikMovies - March 17, 2018 - 15:26 PM IST

మరిన్ని వార్తలు

యంగ్ హీరో నిఖిల్ తాజా చిత్రం కిరాక్ పార్టీ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక విడుదలయిన తొలిరోజు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకోగలిగింది.

ఈ విషయం మొదటిరోజు కలెక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా రూ 6 కోట్ల (గ్రాస్) మేర వసూళ్ళు సాధించినట్టు సమాచారం. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ 4.7 కోట్ల (గ్రాస్) వసూలు చేసింది.

ఇక ఈరోజు రేపు కలెక్షన్స్ పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి, అలాగే రేపు ఉగాది కావడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు. కన్నడలో వచ్చిన కిరిక్ పార్టీ అనే విజయవంతమైన చిత్రానికి ఈ కిరాక్ పార్టీ అఫీషియల్ రీమేక్.

చూద్దాం.. ఈ యంగ్ హీరో స్టామినా ఎంత ఉందొ తెలియడానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్ర కలెక్షన్స్ తో తేలిపోనుంది...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS