జల్లికట్టుకి కోలీవుడ్ బాసట

By iQlik Movies - January 18, 2017 - 02:43 AM IST

మరిన్ని వార్తలు

ఇప్పుడు ఏ ఛానల్ చూసినా ఏ పేపర్ చదివినా మనకు కనిపించి వినిపించే అంశం జల్లికట్టు. ప్రస్తుతం జల్లికట్టుపై ఉన్న బ్యాన్ ని ఎత్తివేసేదాకా తమ పోరాటం ఆపమని తమిళ ప్రజలు డంకా బజాయించి చెబుతున్నారు. ఈ విషయంలో కోలీవుడ్ కూడా తన సంపూర్ణ మద్దతు తెలిపింది. ప్రముఖ నటుడు శింబు అయితే ఈ జల్లికట్టు ఉద్యమాన్ని ముందు వరసలో ఉండి నడిపిస్తున్నాడు. ఇంతకుముందే ఇవ్వాళ రాత్రి 8 గంటల నుండి జరపబోయే నిరసన కార్యక్రమంలో అందరు పాల్గొనాల్సిందిగా వీడియో మెసేజ్ ద్వారా అందరిని కోరాడు.
సోషల్ మీడియా ద్వారా సినీప్రముఖులు జల్లికట్టుకి తమవంతు మద్దతు తెలియపరుస్తూనే ఉన్నారు. అయితే సామాన్య ప్రజలు మాత్రం ఇప్పటికే మెరీనా బీచ్ కి చేరుకొని తమ ఆకాంక్షని తెలియపరిచే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే నటులు త్రిష, విశాల్ తీరుపైన తమిళనాట ఇంకా గుర్రుగానే ఉన్నట్లు తమిళ వర్గాల భోగట్టా. వారు జలికట్టుకివ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. చివరికి వీరిద్దరి శవయాత్ర చేసేవరకు వెళ్ళారంటే అక్కడి ప్రజలు జల్లికట్టుని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధమవుతుంది.