ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో `జనతా గ్యారేజ్` వచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. `ఆర్.ఆర్.ఆర్` తరవాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదే. `ఆచార్య` తరవాత కొరటాల నుంచి వచ్చే సినిమా కూడా ఇదే. కథ ఎప్పుడో రెడీ. అన్నీ బాగుంటే, సంక్రాంతి తరవాత.. ఈ సినిమా లాంఛనంగా మొదలవుతుంది.వేసవిలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయట చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ఈ సినిమాలో... ఎన్టీఆర్ కి బాబాయ్‌గా రాజశేఖర్ నటించబోతున్నాడట.
జనతా గ్యారేజ్‌లో.. ఎన్టీఆర్ కి పెదనాన్నగా మోహన్ లాల్ నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర బాగా పేలింది. మోహన్ లాల్ వల్ల.. సినిమా స్థాయి పెరిగింది. అలాంటి పాత్రే.. ఈ కథలోనూ ఉందని, ఆపాత్ర కోసం రాజశేఖర్ పేరు పరిశీలిస్తున్నట్టు టాక్. నిజానికి ఇలాంటి క్యారెక్టర్ వేషాలు ఇది వరకు కూడా రాజశేఖర్‌కి చాలా వచ్చాయి.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ప్రకాష్‌రాజ్ పోషించిన పాత్ర కోసం ముందు రాజశేఖర్ పేరే అనుకున్నారు. ధృవలో... అరవింద స్వామి పాత్ర కోసం కూడా రాజశేఖర్ పేరు పరిశీలించారు. కానీ అప్పట్లో కుదర్లేదు. ఓసినిమాని రాజశేఖర్ స్వయంగా రిజెక్ట్ చేస్తే, మరో సినిమా చేజారిపోయింది. అయితే ఈసారి కొరటాల శివ.. రాజశేఖర్‌ని ఒప్పించాడని, భారీ పారితోషికం ఇస్తానని చెప్పడంతో, రాజశేఖర్ కూడా ఓకే అన్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్.