కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన `ఆచార్య` కథ నాదే అంటూ.. ఓ దర్శకుడు గళం విప్పడం, దాని గురించి సోషల్ మీడియాలో రచ్చ మొదలవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎట్టకేలకు ఈ వ్యవహారంపై కొరటాల శివ స్పందించారు. `ఆచార్య కథ నా సొంతకథే. కావాలంటే సంతకం చేసి ఇస్తా. రాజేష్ చెబుతున్న కథకూ, నా కథకూ సంబంధం లేదు. తాను రాసుకున్న కథపై రాజేష్‌కు అంత నమ్మకం ఉంటే, ఆ కథతో నిరభ్యంతరంగా సినిమా చేసుకోవొచ్చు. కావాలంటే నా సినిమా కంటే ముందే విడుదల చేసుకోవొచ్చు` అని క్లారిటీ ఇచ్చారు.
ఇలా నిరాధారమైన ఆరోపణలు ఇక ముందు కూడా చేస్తే, తప్పకుండా కోర్టుకు వెళ్తానని, చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు కొరటాల. ఓ నేపథ్యంలో `శ్రీమంతుడు` ఇష్యూ కూడా మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ సినిమా కథపైనా కాపీ అనే ముద్ర పడింది. వాటి గురించి కూడా కొరటాల ప్రస్తావించారు. ``శ్రీమంతుడు కథపై ఇప్పటికీ 10 కేసులున్నాయి. ముఖ్యమంత్రిపై రాసుకున్న ప్రతీ కథా.. శ్రీమంతుడు కథే అంటే ఎలా? అమీర్ ఖాన్ తీస్తున్న సినిమా కథా, ఆర్.ఆర్.ఆర్ కథ ఒకటే అంటాను. అమీర్ ఖాన్ వచ్చి నాకు కథ చెబుతారా? ఇలా ప్రతి ఒక్కరూ... ఈ కథ నాదే అనుకుంటూ పోతే.. అందరి ముందూ నా సినిమా కథ నేను చెప్పుకోవాలా`` అని ప్రశ్నిస్తున్నారు కొరటాల శివ.