బిగ్ బాస్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ సందర్భంగా మంచి-చెడు టాస్క్ ఇంటి సభ్యుల మధ్య తీవ్ర విబేధాలకి దారితీసింది. ఇక ఆ టాస్క్ సమయంలో తనతో అనుచితంగా ప్రవర్తించాడు కౌశల్ అంటూ భాను శ్రీ తీవ్రస్థాయిలో ఆయన పై మండిపడింది, దీనికి తేజస్వి కూడా వత్తాసు పలకడంతో ఈ అంశం చాలా పెద్ద గొడవకి దారితీసింది.
దీనితో కౌశల్ కి వ్యతిరేకంగా తేజస్వి చేసిన కొన్ని కామెంట్స్ హౌస్ లో పెద్ద చర్చకి ఆస్కారం ఇచ్చాయి. ఇదే సమయంలో భాను టీం సభ్యురాలు అయిన గీత మాధురీ.. కౌశల్ కి మద్దతు పలకడం విశేషం. ఈ టాస్క్ మొదలైన రోజు నుండి ఇంటి సభ్యుల మధ్య చిన్న చిన్న మాటలు, గొడవలు నడుస్తూనే ఉన్నా నిన్న జరిగిన ఈ అంశం మాత్రం ఇంటి వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించేశాయి.
అయితే గొడవ సద్దుమనిగాక కౌశల్, భానులు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోగా కౌశల్-తేజస్వి లు మాత్రం ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు ఇష్టపడలేదు. నిన్నటి ఎపిసోడ్ మొత్తానికి కొసమెరుపు ఏంటంటే- ఈ టాస్క్ మొత్తం లో సరిగా ఆడని ఒక ఇంటి సభ్యుడికి జైలు శిక్ష విధించాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించగా ఇంటి కెప్టెన్ గా భాను శ్రీ ని కౌశల్ జైలులో పెట్టాడు. మరి ఈ తాజా పరిణామం ఇంటిలో ఇంకెన్ని గొడవలకి దారి తీస్తుందో అన్నది వేచి చూడాలి.
అయితే నిన్నటి ఎపిసోడ్ చూసిన వారందరూ అలాగే ఇంటి సభ్యులు కూడా ఈ గొడవ మొత్తానికి కారణం ఒకరు అంటూ తమ తమ అభిప్రాయాలు వ్యక్తంచేశారు. మీరు నిన్నటి ఎపిసోడ్ చూస్తే ఆ గొడవ కి కారణమైన అసలు విలన్ ఎవరో మీకే తెలిసిపోతుంది.
చివరగా... ఏమైనా జరగోచ్చు...