రవితేజ - శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం `క్రాక్`. సంక్రాంతి రేసులో ముందుగా వస్తున్న సినిమా ఇదే. శనివారమే విడుదల అవుతోంది. రవితేజకి వరుస ఫ్లాపులు వచ్చిన నేపథ్యంలో క్రాక్ కి బిజినెస్ జరుగుతుందా? ప్రొడ్యూసర్ సేఫ్ అవుతాడా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ... ఈ సినిమా సేఫ్ ప్రాజెక్టుగా మిగిలిపోయింది. ఈ సినిమాకి రూ.42 కోట్ల బడ్జెట్ అయ్యింది. అదంతా ప్రీ బిజినెస్ లోనే తిరిగి వచ్చేసింది.
ఓటీటీ, హిందీ డబ్బింగ్ రైట్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. రవితేజ సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో భారీగా గిట్టుబాగు అవుతుంది. `క్రాక్`కి కూడా ఇది వరకెప్పుడూ రానంత రేటు వచ్చిందట. ఓటీటీ కూడా ఈ సినిమాకి వరంగా మారింది. అన్ని ఏరియాల్లో కలిపి కేవలం 15 కోట్ల బిజినెస్ చేసింది. మిగిలినవన్నీ... వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయమే. మొత్తానికి ఠాగూర్ మధు విడుదలకు ముందే సేఫ్ జోన్ లో పడిపోయాడు.