హైదరాబాద్ రాడిసన్ హోటల్ ల్లో డ్రగ్స్ పట్టుబడటంతో మళ్ళీ టాలీవుడ్ ఇనివాల్వ్ మెంట్ ఉన్నట్టు, సినీ ఇండస్ట్రీ వ్యక్తుల పేర్లు బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతోంది అని సమాచారం అందటంతో పోలీసులు రైడ్ చేయగా, ఆ టైంలో టాలీవుడ్ టాలెంటెడ్ డైరక్టర్ క్రిష్ కూడా అక్కడ పట్టుబడ్డాడని తెలిసి అంతా అవాక్కు అయ్యారు. తాను కేవలం తన ఫ్రెండ్ వివేకానంద్ ని కలవటం కోసమే వచ్చానని, తాను డ్రగ్స్ తీసుకోలేదని క్రిష్ వెల్లడించినట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించి అతను డ్రగ్స్ తీసుకున్నారో లేదో అని తేలుస్తాం అని తెలిపారు.
ఎఫ్ ఐ ఆర్ లో పోలీసులు క్రిష్ పేరును A10 గా చేర్చారు. విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా, తాను ముంబైలో ఉన్నానని సోమవారం విచారణకు వస్తారని తెలిపారు. అవుట్ ఆఫ్ సిటీ, రాలేను అంటూ తప్పించుకు తిరిగారు. ఇంతవరకు పరారీలో ఉన్న క్రిష్ ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ముందుగానే బెయిల్ కోసం అప్లై చేయడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్రిష్ నిజంగానే డ్రగ్స్ తీసుకున్నారా..? అనే పలు సందేహాలు వెలువడుతున్నాయి. క్రిష్ విచారణకు వస్తే గాని నిజా నిజాలు బయట పడవు. ఈ రోజు గచ్చిబౌలి పోలీసుల ముందు క్రిష్ హాజరు అయ్యో అవకాశం ఉందని సమాచారం.
రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుల్లో ఒకడైన నీల్A9 విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న సందీప్, శ్వేత, యూట్యూబర్ లిషిత తదితరుల ఆచూకీ దొరకలేదు. ఇప్పటికే అరెస్టయిన నిందితుల ఫోన్ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు తెలిసింది. మరో నిందితుడు రఘు చరణ్‌కు నార్కోటిక్ పరీక్షలు నిర్వహించారు. గజ్జల వివేకానంద డ్రగ్ పార్టీల వివరాల కోసం పోలీసులు అతడి వాట్సాప్ చాటింగ్స్, గూగుల్ పే పేమెంట్స్ ఆధారాలను కూడా సేకరిస్తున్నారు.