ఛలో బాలీవుడ్ అంటున్న వినాయకుడు

మరిన్ని వార్తలు

ఈమధ్య తెలుగు సినిమాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. హిందీ డబ్బింగ్ వెర్షన్లను ఉత్తరాది ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తున్నారు. మరోవైపు తెలుగు సినిమాలను హిందీలోకి రీమేక్ చేసేందుకు పలువురు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో, ప్లానింగ్ దశలో దాదాపుగా డజను తెలుగు సినిమాల రీమేక్స్ ఉన్నాయంటే తెలుగు సినిమాలకు డిమాండ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ లిస్టులోకి మరో కొత్త సినిమా కూడా వచ్చి చేరింది. అదే 'వినాయకుడు'.

2008 లో రిలీజ్ అయిన 'వినాయకుడు' సినిమాలో కృష్ణుడు, సోనియా, పూనమ్ కౌర్ లు హీరో, హీరోయిన్లుగా నటించారు. సాయికిరణ్ అడివి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీసు దగ్గర విజయం సాధించడమే కాకుండా నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది.  ప్రస్తుతం ఈ సినిమాకు హిందీ రీమేక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయట. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన సాయికిరణ్ అడివి హిందీ వెర్షన్ కూడా దర్శకత్వం వహిస్తారని సమాచారం.

ప్రస్తుతం ఈ  సినిమాకు స్క్రిప్టు వర్కు జోరుగా సాగుతుందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను వెల్లడిస్తారని అంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS