కైపెక్కిస్తోన్న 'తీన్‌మార్‌' అందం.!

By iQlikMovies - April 18, 2018 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

మోడలింగ్‌ రంగం నుండి వచ్చి తెలుగులో 'బోణీ' సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ కృతికర్బంద. కెరీర్‌ తొలినాళ్లలోనే పవర్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో 'తీన్‌మార్‌' సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా ఆశించిన రిజల్ట్‌ అందివ్వకపోవడంతో, అమ్మడు రేస్‌లో వెనకే ఉండిపోయింది. తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో 'బ్రూస్‌లీ' సినిమాలోనూ నటించింది. 

అయితే ఈ సినిమాలో చరణ్‌కి అక్కగా నటించిందీ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది కృతికర్బంద. అయినా తెలుగులో చెప్పుకోదగ్గ సక్సెస్‌లు అమ్మడి ఖాతాలో జమ కాలేవు. దాంతో మంచి అవకాశాల కోసం ఎప్పటికప్పుడే ఇదిగో ఇలా సోషల్‌ మీడియాలో మన తెలుగు దర్శక నిర్మాతలకు హాట్‌ హాట్‌ అందాలతో క్రీమ్‌ బిస్కెట్స్‌ వేస్తూ ఉంటుంది. తెలుగులో అవకాశాల్లేకపోయినా, కన్నడ, హిందీ భాషల్లో ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో నటిస్తోంది కృతీ కర్బందా. 

ఏమాటకామాటే చెప్పుకోవాలి కానీ ఈ ఫోటో చూస్తుంటే, అందానికి అందం, హాట్‌నెస్‌కి హాట్‌నెస్‌ కృతికర్బందా సొంతం అనిపించట్లే. అందుకే ఒక్క హిట్‌ పడిందంటే చాలు చక్రం తిప్పేయదూ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS