1-నేనొక్కడినే చిత్రంతో తెరంగేట్రం చేసిన కృతి సనన్ తనపై వస్తున్న పుకార్ల పైన క్లారిటీ ఇచ్చింది.
ఈ మధ్యనే తాను కలిసి నటించిన హీరో సుశాంత్ తో ప్రేమలో పడ్డాను అని అతనితో కలిసి ఉంటున్నాను అని వస్తున్న పుకార్లను ఆమె చాలా తీవ్రంగా ఖండించింది. తనని ఒక నటిగా గుర్తించడం మానేసి ఒక హీరోకి ప్రేయసి అంటూ మాట్లాడడం చాలా బాధ కలిగిస్తుంది అని చెప్పుకొచ్చింది.
ఇక ఆమె నటించిన బరేలీకి బర్ఫీ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం అలాగే తన నటనకి కూడా ప్రశంసలు అందడం చాలా రిలీఫ్ అనిపిస్తున్నది అని తెలిపింది.
ఈ స్టేట్మెంట్ తో తాను తన కెరీర్ పట్ల ఎంత కమిట్మెంట్ తో ఉన్న విషయం మనకు అర్ధమవుతున్నది.