'వన్ - నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ కృతిసనన్. మహేష్‌బాబుకి సరిజోడీగా ఫ్యాన్స్‌లో గుర్తింపు బాగానే దక్కించుకుంది. కానీ, సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆఫర్ పరంగా క్రేజ్ దక్కించుకోలేకపోయింది. తర్వాత 'దోచేయ్' సినిమాలో నటించింది. ఈ సినిమా మరీ దారుణమైన రిజల్ట్ ఇచ్చింది అమ్మడికి. దాంతో బ్యాక్ టు ఫెవిలియన్ అంటూ బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్ కృతి సనన్.
ప్రస్తుతం 'హౌస్‌ఫుల్ 4' సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబు రత్నానీ క్యాలెండర్ కోసం ఇదిగో ఇలా పోజిచ్చి మతులు పోగొడుతోంది. అమ్మాయిల అందాల్ని మరింత అందంగా చూపించడంలో సిద్ధహస్తుడు డబు రత్నానీ. ఆయన కెమెరాలో బంధీ అయ్యి అందంగా మెరిసి, మురిసిపోవాలనుకుంటారు అందాల భామలు. ఆ ఛాన్స్ మన పొడుగు కాళ్ల సుందరి కృతిసనన్‌కి దక్కిందిప్పుడు. బ్లాక్ అండ్ బ్లాక్ మ్యాచింగ్ యాక్సెసరీస్‌తో క్యూట్ అండ్ హాట్ పోజు ఎలా ఇచ్చిందో చూశారుగా.