ప్రభాస్ తో కృతి

మరిన్ని వార్తలు

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ మంచి జోరు మీదున్నాడు. వరస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇంకో నాలుగేళ్ళ వరకు ప్రభాస్ డైరీ ఫుల్ అనేలా ఉన్నాయి తన ప్రాజెక్ట్స్. అన్ని సినిమాలు పాన్ ఇండియావే కావటం గమనార్హం. కొన్ని పాన్ వరల్డ్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సలార్ తో భారీ హిట్ కొట్టిన డార్లింగ్, నెక్స్ట్ కల్కి సినిమాతో రానున్నాడు. సినీపరిశ్రమలో ప్రభాస్ ని ఎవరూ బీట్ చేయలేకపోతున్నారు. ప్రభాస్ చేసిన నాలుగు సినిమాలు 300 కోట్లకు పైగా  కలెక్షన్స్ రాబట్టి, ఎక్కువసార్లు  అత్యధిక గ్రాస్ వసూలు చేసిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేసాడు.


ప్రజంట్ ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ప్రభాస్ సినిమా అనగానే హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు, అన్న చర్చలు కూడా మొదలవుతాయి. మొదటనుంచి ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తుందని, మృణాల్ అయితే ప్రభాస్ కి సరైన జోడి అని, పైగా వీరి కాంబినేషన్ కూడా కొత్తగా ఉంటుందని వినిపించింది. హను రాఘవపూడి ఇప్పటికే మృణాల్ ఠాకూర్ తో సీతారామం కోసం వర్క్ చేయటం వలన, మళ్ళీ తనకే ఓటు వేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ భామని తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. 


ప్రజంట్ ఆలియా భట్ బాలీవుడ్ లో బిజీగా ఉంది. నెక్స్ట్ రాజమౌళి, మహేష్ సినిమాలో ఎంపిక అయ్యింది. దీనితో ఇప్పుడప్పుడే ఆలియా ఫ్రీ అవదు.  దీపికా ఇప్పటికే కల్కిలో ప్రభాస్ తో యాక్ట్ చేస్తోంది. తన ప్రెగ్నెన్సీ కారణంగా కొత్త సినిమాలు ఒప్పుకోవటం లేదు.  ఈక్రమంలోనే  కృతిసనన్ పేరు వినిపిస్తున్నట్టు టాక్.  ఆది పురుష్ లో ఇప్పటికే వీరిద్దరూ జంటగా కనిపించారు. ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచినా, ప్రభాస్, కృతి జోడికి మంచి మార్కులే పడ్డాయి. దీనితో మళ్ళీ వీరి కాంబో అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. ఈ న్యూస్ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS