క్షణం చిత్రంతో ఒక్కసారిగా అందరిని తనవైపు తిప్పుకున్న యంగ్ డైరెక్టర్ రవికాంత్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు.
వివరాల్లోకి వెళితే, దర్శకుడు రవికాంత్ పెరేపుతో సంగీత దిగ్గజం ఘంటసాల మనవరాలు అయిన వీణ (ప్రఖ్యాత డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు ఘంటసాల రత్నకుమార్ కూతురు) కి ఈనెల 12వ తేదిన ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది.
ఇప్పటికే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న వీణకి దర్శకుడైన రవికాంత్ తో క్షణం సినిమాకి డబ్బింగ్ చెబుతున్న సమయంలో ప్రేమ చిగురించిందట. ఈ విషయాన్ని తమ పెద్దలకి చెప్పి వారిని ఒప్పించి ఇప్పుడు ఒకటవుతున్నారు.
వీరి వివాహం నవంబర్ 11న జరపనున్నట్టు ఇరు కుటుంబాల సభ్యులు తెలియచేశారు. ఇక రవికాంత్ తన రెండవ చిత్రాన్ని తెరకెక్కించే పనుల్లో ఉన్నాడు.