పవన్ కల్యాణ్ ఫాలోయింగ్ కీ, ఫ్యాన్ బేస్‌కీ మరోసారి అద్దం పట్టింది `ఖుషీ` సినిమా. డిసెంబరు 31న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఒక్క రోజే. రూ.3.5 కోట్లు సాధించి కొత్త రికార్డు సృష్టించింది.
రీ రిలీజ్‌లలో ఇన్ని వసూళ్లు సాధించిన సినిమా మరోటి లేదు. ఇది వరకు పవన్ పుట్టిన రోజుకు విడుదలైన జల్సా రూ.3.2 కోట్లతో సరిపెట్టుకొంది. పోకిరికి రూ.1.75 కోట్లు వచ్చాయి. విశేషం ఏమిటంటే... చాలా చోట్ల `ఖుషి` షోలను ఆపేశారు. అనుమతులు లేవని, లైసెన్స్ లేదని ఏవో కారణాలు చెబుతూ... థియేటర్లకు తాళాలువేశారు. ఆన్ లైన్‌లో టికెట్లు కొంటే.. ఆ టికెట్ డబ్బులు మళ్లీ తిరిగి ఇచ్చేశారు. ఆ షోలు కూడా పడి ఉంటే... ఖుషి కచ్చితంగా రూ.4 కోట్ల మైలు రాయి చేరుకొనేది.
ఉదయం 5 గంటల నుంచే ఖుషీ హడావుడి మొదలైపోయింది. ఈ సినిమాకి తెల్లవారుఝామున ప్రీమియర్ షోలు కూడా వేయడం విశేషం. ఓ రీ రిలీజ్ సినిమాకి ఇలా ప్రీమియర్లు వేయడం ఇదే తొలిసారి. ఖుషి సినిమాని బీట్ చేయాలంటే.. మిగిలిన హీరోలకు సాధ్యం అవుతుందా? అనేది అనుమానమే. అల్లు అర్జున్ `దేశ ముదురు` చిత్రాన్ని ఇప్పుడు రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ సినిమా ఏమైకా ఖుషి ని క్రాస్ చేస్తుందేమో చూడాలి.