దర్శకుడి ఇంట్లో పనిచేస్తున్న మహిళ అనుమానస్పద మృతి!

మరిన్ని వార్తలు

ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి ఇంటిలో పనిచేస్తున్న ఓ మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది.

అందుతున్న వివరాల ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిని జయశ్రీ (19) అనే మహిళ కొంతకాలంగా కోదండరామిరెడ్డి ఇంటిలో పనిచేస్తుంది. ఆ క్రమంలో ఆమెకి ప్రత్యేకంగా ఒక గది ఆ ఇంటి ఆవరణలో ఆమె ఉండడానికి కేటాయించారు.

అయితే నిన్న సాయంత్రం ఆమె ఆ గదిలో ఆత్మహత్య చేసుకోవడంతో వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. అయితే దీనికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు.

ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS