ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్ ఇంతకు ముందెన్నడూ కనిపించనంత హాట్నెస్ ప్రదర్శించింది తాజా సినిమా 'జూలీ 2'లో. ఈ హాట్నెస్తోనే నిరంతరం వార్తల్లో నిలిచింది ఈ హాట్ బ్యూటీ. భారీ అంచనాలతో తెరకెక్కింది ఈ సినిమా. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'జూలీ 2'. కానీ సినిమా నిరాశ పరచడంతో చిత్ర యూనిట్ డీలా పడింది.
ఎన్నో వివాదాలను, ఆటంకాలను ఎదుర్కొని ధియేటర్లో సందడి చేసిన ఈ సినిమా, అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. కానీ లక్ష్మీరాయ్ మాత్రం ఓటమిని ఒప్పేసుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందనీ ఆమె ఓటమిని అంగీకరించింది. ఎన్నో ప్రత్యేకతల నడుమ తెరకెక్కిన 'జూలీ 2' నిరాశ పరచడం ఒకింత బాధపడాల్సిన విషయమే ఆమె అభిమానులకు. అయితేనేం. ఓటమి గెలుపుకు నాంది. దాన్ని అంగీకరించడం ఓ గొప్ప కళ.
ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్లో హాట్‌నెస్‌తో పాటు, ఈ గొప్ప కళ కూడా ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం లక్ష్మీరాయ్ చాలా కష్టపడింది. ఏకంగా పది కిలోల బరువు తగ్గింది. అంత బరువు తగ్గించడానికి లక్ష్మీరాయ్ చేసిన కసరత్తులు అన్నీ ఇన్నీ కావు. బాలీవుడ్లో ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది లక్ష్మీరాయ్. సినిమా విజయం సాధించి వుంటే ఈ ముద్దుగుమ్మకి మంచి గుర్తింపు దక్కేది. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది.
అయితే ఆడియన్స్‌కి రీచ్ కాలేకపోయింది ఎందుకో. చాలా కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతూంటాయి. చాలా పెద్ద హిట్ అవుతుందని భావించారు ఈ సినిమాని అంతా. కానీ భారీగా నిరాశ పరిచింది. ఏదేమైనా ఈ సినిమా పేరు చెప్పి లక్ష్మీరాయ్ అందం రెట్టింపైంది. గ్లామర్ బ్యూటీగా ప్రతీ రోజూ వార్తల్లో హల్చల్ చేసింది. చూద్దాం తదుపరి సినిమాలోనైనా లక్ష్మీరాయ్ టాలెంట్‌కి, పడిన కష్టానికీ తగ్గ గుర్తింపు దక్కుతుందేమో!