షార్ట్ ఫిలింస్‌తో పాపులరైన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరుకు ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే, 'అ' సినిమాని తెరకెక్కించడంతో ఈ డైరెక్టర్ పేరు ఇటీవల మార్మోగిపోయింది. టాలీవుడ్‌లో అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించేశాడు ఈ యంగ్ అండ్ డైనమిక్ కుర్రోడు. 'అ' వంటి కొత్త రకం సబ్జెక్ట్‌ని తెలుగు తెరకు పరిచయం చేశాడు.టాలీవుడ్ సినిమా స్ట్రాటజీనే మార్చేశాడు.
ఈ తరహాలో కూడా సినిమాలు తీయొచ్చు. అలాంటి సినిమాలకు ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయొచ్చు అని నిరూపించాడు ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ. నాని సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌తో సినిమాలు చేసేందుకు పలువురు హీరోలు ముందుకొచ్చారు. ఇకపోతే అంతకన్నా ముందుగా సీనియర్ హీరో రాజశేఖర్ ఇంకాస్త ముందడుగు వేశాడనీ తెలుస్తోంది.
హీరోగా రాజశేఖర్‌ని మర్చిపోయారంతా అనుకున్న టైంలో ప్రవీణ్ సత్తారుతో 'గరుడవేగ' సినిమాలో నటించి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, హీరోగా రాజశేఖర్ తన సత్తా చాటాడు. తాజాగా కొత్త డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో రాజశేఖర్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడనీ తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌నే తెరకెక్కిస్తానని గతంలోనే ప్రశాంత్ వర్మ చెప్పాడు. అయితే రాజశేఖర్ వంటి సీనియర్ హీరోతో ప్రశాంత్ తీయబోయే సినిమా ఎలా ఉంటుందనే అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా మరోసారి మన యాంగ్రీయంగ్‌మ్యాన్ రాజశేఖర్ యంగ్ డైరెక్టర్‌తో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడనిపిస్తోంది. చూద్దాం ఈ సినిమాతో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడేమో.