ప్రస్తుతం హీరో ధనుష్ ఒక విచిత్ర పరిస్థితిని ఎదురుకొట్టున్నాడు! అది ఏకంగా తను తల్లిదండ్రులు ఎవరు అనేది నిరూపించుకోవాల్సిన ఒక అసాధారణ పరిస్థితిలో ఆయన ఉన్నాడు.
మదురై కి చెందిన కదిరేషన్-మీనాక్షీ వృద్ధ దంపతులు ధనుష్ తమ కన్నబిడ్డనే అని ఆయన పై వేసిన కేసులో కీలక మలుపు తిరిగింది. ఇరు వైపుల వాదనలు విన్న మదురై కోర్టు, ప్రస్తుతానికి ధనుష్ ని డిఎన్ఏ పరీక్షాల ద్వారా పరీక్షించాలన్న ఆ దంపతుల విజ్ఞప్తిని కోర్టు త్రోసిపుచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ కేసు పై కోర్టు ఆఖరి తీర్పు ఈనెల 9వ తేదిన వెలువరించే ఆస్కారం ఉందని ఇరువైపుల లాయర్లు ఆశాబావం వ్యక్తం చేశారు.