నటి భావనను కిడ్నాప్ చేసి లైంగిక దాడులకు గురిచేసిన సంఘటన్ యావత్ దేశాన్ని ఒక కుదుపు కుదిపిందనే చెప్పాలి.
అయితే ఈ కేసులో కేరళ పోలీసులు ఒక అడుగు ముందుకు వేసినట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ నేరంలో పాల్గొన్న కొంతమంది సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకునట్టు సమాచారం. అయితే వారి వివారాలు ఇంకా తెలియల్సివుంది. ఇదిలాఉంటే, ఈ సంఘటన జరిగిన వెంటనే భావన దగ్గర పనిచేసిన మాజీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి కేసు దర్యప్తుకి ఆదేశించింది.
త్వరలోనే అందరు నిందితులని పట్టుకుంటాము అని పోలీస్ బాస్ ఒకరు స్పష్టం చేసారు.