కిమ్స్ హాస్పిటల్ లో చికిత్సపొందుతున్న దాసరి నారాయణ రావు గారి ఆరోగ్య పరిస్థితి పై ఇప్పుడే కిమ్స్ హాస్పిటల్ వైద్యులు స్పందించారు.
వారు చెప్పిన దాని ప్రకారం, ఈ రోజు శస్త్రచికిత్స చేసి ఇన్ఫెక్షన్ ని తొలగించేసారు. ఆ సమయంలోనే కిడ్నిల్లో తలెత్తిన సమస్యకి డయాలసిస్ చేస్తున్నారట అలాగే ఊపిరితిత్తులకు వెంటిలేటర్ ద్వారా చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే నిన్నటి మీద ఇవ్వాల పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు అలాగే రేపు ఎల్లుండిలోపు కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అక్కడే ఉండి ప్రతిక్షణం దాసరి ఆరోగ్యం గురించి ఆరాతీస్తున్న మోహన్ బాబు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలువురు సినీప్రముఖులు దాసరి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుని దాసరి కుటుంబ సభ్యుల్ని ఒదారుస్తున్నారు.