భారత రత్న, గాన కోకిల లతా మంగేష్కర్ మరణం.. సంగీత ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆమె మరణం... నిజంగా తీరని లోటు. గత రెండు మూడు రోజుల నుంచీ ఎక్కడ విన్నా లత పాటలూ.. ఆమెకు సంబంధించిన మాటలే. వీటి మధ్య లత ఆస్తి పాస్తుల లెక్కలూ బయటకు వచ్చాయి. ఆమె ఆస్తుల విలువ దాదాపుగా రూ.200 కోట్లుగా తేలింది. అయితే ఆ ఆస్తులు ఎవరికి చెందుతాయన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
ఎందుకంటే లతాజీ వివాహం చేసుకోలేదు. ఆమె ఒంటరి జీవితాన్నే గడుపుతున్నారు. చట్టబద్ధంగా ఆమెకు వారసులు ఎవరూ లేరు. దాంతో ఈ 200 కోట్లూ ఎవరికి చెంఉతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. లతాజీకి ముగ్గురు సోదరీమణులున్నారు. ఓ సోదరుడు ఉన్నాడు. వీళ్లలో ఎవరికైనా ఆస్తి పంచాలా? అనే విషయం తేలాల్సివుంది. దానికితోడు లతాజీ తన తండ్రి పేరిట ఓ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఆమె ఆస్తులన్నీ ఆ ట్రస్ట్ కే అని టాక్. ఏదేమైనా లతాజీ వీలునామా చూస్తే గానీ, ఈ విషయం తేలదు. త్వరలోనే లతాజీ వ్యక్తిగత న్యాయవాదులు ఈ ఆస్తుల విషయంలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.