గ్లామ్‌షాట్‌: బ్లాక్‌ అండ్‌ బ్రైట్‌ అందాల రాక్షసి!

By Inkmantra - January 10, 2020 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అందంగా పలకరించిన ముద్దుగుమ్మ 'లావణ్య త్రిపాఠి'. తొలి సినిమాతో హిట్‌ కొట్టింది. కానీ, కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ అంటే లావణ్య కెరీర్‌లో 'భలే భలే మగాడివోయ్‌' సినిమాగానే పరిగణించాలి. ఆ తర్వాత 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో స్టార్‌ హీరో నాగార్జున సరసన నటించి మరో సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. లేటెస్ట్‌గా 'అర్జున్‌ సురవరం' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది.

కెరీర్‌కి ఈ సినిమా ఎంత యూజ్‌ అయ్యిందనే మాట పక్కన పెడితే, సినిమా మాత్రం హిట్‌ లిస్టులోనే చేరింది. ఇక తాజా పిక్‌ విషయానికి వస్తే, ఓ మ్యాగజైన్‌ కోసం ఇదిగో ఇలా కళ్లు చెదిరే బ్రైట్‌ లుక్స్‌లో దర్శనమిచ్చింది. బ్లాక్‌ చెమ్కీ డిజైన్డ్‌ మోడ్రన్‌ వేర్‌లో లావణ్య పోజు స్పెషల్‌ కిక్కిస్తోంది. బ్యాక్‌ గ్రౌండ్‌, లైటింగ్‌ బ్రైట్‌నెస్‌.. అన్నీ ఈ పిక్‌కి చక్కగా అద్దినట్లు అతికాయి. బ్లాక్‌ కాస్ట్యూమ్‌లో వైట్‌ కలర్‌ స్కిన్‌ టోన్‌ మత్తెక్కిస్తోంది. ముఖ్యంగా ఆ సైడ్‌ కట్‌లో థై సోయగాలు చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS