'గీత గోవిందం' వ‌దిలేసినంద‌కు బాధ లేద‌ట‌!

By Inkmantra - November 23, 2019 - 14:45 PM IST

మరిన్ని వార్తలు

హీరోయిన్ల‌కు ఛాయిస్ ఉండ‌దు. ఎలాంటి పాత్ర వ‌చ్చినా చేయాల్సిందే. అందునా అప్పుడ‌ప్పుడే అడుగులు వేస్తున్న‌ప్పుడు వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్నీ ఒడిసిప‌ట్టుకోవాలి. అయితే చేతులారా ఓ హిట్టు సినిమా వ‌దులుకోవ‌డం మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. లావ‌ణ్య త్రిపాఠి కూడా ఓ హిట్టు సినిమాని వ‌దులుకోవాల్సివ‌చ్చింది. ఆ సినిమానే `గీత గోవిందం`. విజ‌య్ దేవ‌ర‌కొండ - రష్మిక జంట‌గా న‌టించిన ఈ చిత్రం వంద కోట్లు అందుకుంది. నిజానికి ఈ సినిమా ముందుగా చాలామంది ద‌గ్గ‌ర‌కు వెళ్లింది.

 

ర‌ష్మిక పాత్ర కోసం స‌మంత‌, రకుల్ ప్రీత్ సింగ్‌ల‌ను సంప్ర‌దించారు. అయితే కుర‌ర్లేదు. లావ‌ణ్య త్రిపాఠీ ద‌గ్గ‌ర‌కీ ఈ క‌థ వెళ్లింది. కానీ లావ‌ణ్య మాత్రం `నో` చెప్పింది. చివ‌రికి ఆ పాత్ర ర‌ష్మిక‌ని వ‌రించింది. సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. ఆసినిమాతో ర‌ష్మిక జాత‌క‌మే మారిపోయింది. అయితే గీత గోవిందం వ‌దిలేసినంత‌కు ర‌ష్మిక ఏమాత్రం బాధ ప‌డ‌డం లేద‌ట‌. ``ఆ సినిమా క‌థ ముందు నాకే వినిపించారు. నాకు బాగా న‌చ్చింది. కానీ కాల్షీట్ల స‌మ‌స్య వల్ల చేయ‌లేక‌పోయాను.

 

ఒక‌టి కావాలంటే ఇంకోటి వ‌దులుకోవాలి క‌దా. అలా గీత గోవిందం వ‌దులుకున్నా. ఆ సినిమా నేను చేస్తే బాగుండేది.కానీ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల బాధ ప‌డ‌డం లేదు. ఇలాంటివి కొన్ని కొన్నిసార్లు జ‌రుగుతాయంతే`` అంటోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS