కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడి దాక ఎదిగిన లారెన్స్ తన తల్లి కోసం ఒక గుడిని కట్తిస్తున్నాడన్న విషయం అందరికి తెలిసిందే.
ఆ గుడిని, ఈ రోజు మదర్స్ డే సందర్భంగా తన తల్లికి కానుకగా ప్రారంభించాడు. ప్రారంభించడమే కాక ఆ గుడిలో తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించాడు.
అయితే ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుడిని అలాగే ఈమధ్యనే తెలంగాణ రాష్ట్రంలో దర్శకుడు పూరి జగన్నాధ్ కి గుడి కట్టించడం చూశాం. కాని ఇలా తన తల్లి పై ఉన్న ప్రేమని ఇలా గుడి కట్టించి మరి చూపెట్టిన వారిలో లారెన్స్ మొదటివాడు.
ఇక ఐక్లిక్ మూవీస్ తరపున అందరికి మదర్స్ డే శుభాకాంక్షలు.